రాహుల్‌కు అండగా ద్రవిడ్‌!

ఈ మధ్య కాలంలో టీమిండియా ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫేలవ ప్రదర్శనతో, కాఫీ విత్‌ కరణ్‌ షో వివాదంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే తన సామర్థ్యంపై భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన మద్దతిచ్చాడు. అతడు మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన క్రికెటరని గుర్తుంచుకోవాలన్నాడు. కేఎల్‌ రాహుల్‌ తిరిగి సత్తాచాటుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ, ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన వన్డే మ్యాచుల్లో రాహుల్ విఫలమయ్యాడు.

కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం, నాణ్యతపై తనకు విశ్వాసముందన్నాడు. అతడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడగల సమర్థుడని, అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన బ్యాట్స్ మెన్ అని పేర్కొన్నాడు. వన్డే, టెస్టు, టీ20ల్లో అతడికి శతకాలు ఉన్నాయి. అతడి ఫామ్‌ గురించి నాకు ఆందోళన లేదన్నాడు. ప్రస్తుతం భారత్-ఎ జట్టు తరుఫున రాహుల్‌ ఆడుతున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో రాహుల్‌ విఫలమయ్యాడు. సీనియర్‌ ఆటగాళ్లను భారత్‌-ఏకు ఎందుకు ఆడిస్తున్నారో ఈ సందర్భంగా ద్రవిడ్‌ వివరించాడు. ఫామ్‌ కోల్పోయిన ఆటగాళ్లు తిరిగి గాడిన పడేందుకు ఇలాంటి సిరీస్ లు దోహదపడతాయని వివరించాడు. ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన ఆటగాళ్లు రాహుల్, పాండ్య… సస్పెన్షన్ అనంతరం కివీస్‌తో సిరీస్‌కు హార్దిక్‌కు చోటు దక్కగా, భారత్‌-ఎ జట్టు తరఫున రాహుల్‌ ఆడుతున్నాడు.

leave a reply