నెగటీవ్‌ రోల్‌లో ‘సీత’గా..

ఇది నాకెంతో ప్రత్యేకం. బ్రిలియంట్‌ తేజ గారితో నా మూడో సినిమా, యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ‘సీత’ టైటిల్‌ లోగో ఇదే’ అంటూ ఎంతో హ్యాపీగా ట్వీట్‌ చేసింది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ లోగోను శనివారం విడుదల చేశారు. అందులో భయపడ్డట్టుగా కాజల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఉంది. కానీ ఈ సినిమాలో కాజల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అయితే.. ఈ సినిమాకు తేజ దర్మకత్వం వహించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ తీస్తున్న సినిమా ఇది. కాగా.. కాజల్‌ నటించిన ‘కవచం’ గత ఏడాది చివర్లో విడుదలైంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో కమల్‌ హాసన్‌ సరసన ఆమె నటిస్తూ బిజీగా ఉంది.

leave a reply