ఛార్జింగ్ తగ్గిపోతుందా…అయితే ఇలా చేయండి!

మొబైల్ వాడకం ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరు దీనిని అధికంగా వినియోగిస్తున్నారు. వివిధ రకాల యాప్స్‌, గేమ్స్‌ అందుబాటులోకి రావడంతో  రోజులో సగభాగం సెల్‌ఫోన్‌కే వినియోగిస్తున్నారు. చేతిలో సెల్‌ లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. అయితే తరుణంలో  వినియోగదారులకి స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ సమస్య ఎక్కువగా చూస్తున్నారు. ఎంత రేటు పెట్టి కొన్న ఫోన్‌ అయినా త్వరగా బ్యాటరీ చార్జింగ్‌ అయిపోవడంతో నిరాశ చెందుతున్నారు. దీంతో  చాల మంది పవర్ బ్యాంకులు వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఒక పూట లేదంటే.. రెండు పూటలు అంతకు మించి చార్జింగ్‌ రాకపోవడంతో  రాత్రి ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి పడుకుంటారు. అయితే మొబైల్ ఛార్జింగ్ ఆధా చేసుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్‌ డిసేప్లేని కలర్‌ఫుల్‌గా ఉంచుతారు. ఇంకొందరు ఫోన్‌ స్ర్కీన్‌పై అధిక బ్రైట్‌ నెస్‌ అధికంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ వినియోగం ఎక్కువవుతుంది. క్రమేణా చార్జింగ్‌ తగ్గిపోతుంది. మనకు అవసరమైన విధంగా స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌ ఉంచుకోవడం చేస్తే ఛార్జింగ్ చాలా వరకు ఆధా అవుతుంది. అవసరమైన యాప్స్ మాత్రమే ఉంచుకుంటే ఛార్జింగ్ కొంత మేర ఆధా అవుతుంది. ఇక ఇంటర్నెట్ విష్యంకి వస్తే దీని వల్ల చాలా వరకు ఛార్జింగ్ వృధాగా పోతుంది మనకు అవసరం లేని సమయంలో వైఫై , మొబైల్ డేటాని ఆఫ్ చేయడం వల్ల ఛార్జింగ్ మిగిలినట్లే. కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యాప్స్ వల్ల కూడా చార్జింగ్‌ తగ్గుతుంది. ఇటువంటి యాప్స్ ని తగ్గించుకోవడం వల్ల కూడా చార్జింగ్‌ ఆధా చేసుకోవచ్చు.

leave a reply