ఏందీ రా.. సామీ.. ఈ గోల

బాలయ్య ఎవరో తెలీదంటూ, ప్రస్తుతం నడుస్తున్న `బయోపిక్‌ల ట్రెండ్‌’పై మెగా బ్రదన్‌ నటుడు నాగబాబు చేసిన ట్వీట్‌లు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. “కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.. చుట్టనేల.. మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా.. విశ్వదాభిరామ.. వినరా మామా”.. అంటూ  ‘కవిత్వాలు మాకు వచ్చండోయ్’ అనేది బ్రాకెట్లో పెట్టారు. పెట్టిన పోస్ట్‌తో.. అటు బాలక్రిష్ణ అభిమానుల నుంచి పెద్ద ఎత్తులో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానుల సంఘాల్లో చర్చలు, గొడవలు, అల్లర్లు చెలరేగాయి.

తాజాగా.. చెన్నైలో ఓ కాలేజ్‌ ఫంక్షన్‌కు గెస్ట్‌గా హాజరైన నటుడు నాగబాబుకు చేధు అనుభవం ఎదురైంది. ఆయన్ను సన్మానిస్తూ కాలేజ్‌ యాజమాన్యం బాలక్రిష్ణ సాంగ్‌ వేయడం.. దానికి నాగబాబు చిన్నగా డ్యాన్స్‌ చేయడం ప్రధాన్యం సంతరించుకుంది. అయితే.. ఫంక్షన్‌లో భాగంగా నాగబాబు ప్రసగిస్తుండగా ‘బాలయ్యా.. బాలయ్యా..’ అంటూ నినాదాలు చేసిన బాలకృష్ణ అభిమానులు. ఇటీవల బాలకృష్ణపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై.. నిరసన వ్యక్తం చేసిన బాలకృష్ణ అభిమానులు. దీంతో.. మోగా బ్రదర్‌ నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

leave a reply