హెచ్‌-1బీ అంటేనే దడ..

ఆందోళనలో నాస్కామ్‌..

హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు విధానంలో అమెరికా అమలు చేస్తున్న విధానాలపై నాస్కామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీలు ముందుగానే యూఎస్‌సీఐస్‌లో ఎలక్ట్రానికల్‌గా నమోదు చేసుకోవాలని అమెరికా ఇటీవల నూతన నిబంధనను ప్రకటించింది. అయితే ఇలాంటి విధానాల వల్ల అమెరికాలోని ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఈ ప్రభావం ఉద్యోగాల మీదా పడే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘హెచ్‌-బీ వీసా లాటరీ సెషన్‌ ప్రారంభం కావడానికి ఇంకెంతో సమయం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కాబోయే ఈ సెషన్‌కోసం ఇప్పటికే ఆయా కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు తెచ్చిన ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే బాగుంటుంది. 139 పేజీల ఈ ప్రతిపాదనను అమలు చేసే ముందు దీనిపై పునఃసమీక్ష జరిపితే మంచిది. రిజిస్ట్రేషన్‌ పద్ధతి వల్ల ఐటీ కంపెనీలకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. అప్పుడు ఐటీ కంపెనీల లాభాలు సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. ఏదేమైనా ఈ విధానం మాత్రం ఉద్యోగాలను కష్టాల్లో పడేస్తుంది’ అని నాస్కామ్‌ అభిప్రాయపడింది.

హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన మార్పులు చేస్తూ అక్కడి యంత్రాంగం శుక్రవారం పలు ప్రతిపాదనలు చేసింది. దీంతో పాటు అమెరికాలో చదువుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఇతర దేశాల్లో చదువుకుని ఉద్యోగాల కోసం వచ్చే వారికి వీసా క్యాప్‌ తగ్గించి అమెరికాలో చదువుకున్న వారికి వీసాలు పెంచాలని తాజాగా ప్రతిపాదనలు చేసింది.

H -1B వీసాదారులు వైద్యపరమైన సంరక్షణ కోసం, సామాజిక భద్రత కోసం పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందగలుగుతారు. వారు దేశానికి సంబంధించిన పన్నులను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

leave a reply