ప్రశాంతంగా.. కానీ, హైదరాబాద్‌‌లో పరిస్థితి దారుణం..!

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పలుచోట్ల లైనులో ఉన్నవారికి పోలింగ్ కొనసాగుతుంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 76.5 శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 50 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు వరకు జరిగింది. ఓటు వేయడానికి జనాలు అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌‌ బూత్‌లకు బారులు తీరారు. అయితే కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఘటనలు తప్ప మిగిలిన అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది.

కాగా.. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడకుడలో మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకూ కూడా జనాలు పెద్ద ఎత్తునే బారులు తీరారు. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటువేయడానికి అవకాశం ఇస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో వారు తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే, హైదరాబాద్‌‌లో పోలింగ్ పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణాల్లో మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. కాగా, డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.

leave a reply