హైకోర్టుపై బీజేపీని.. రాయలసీమ ప్రజలు విశ్వసించరు..!

భారతీయ జనత పార్టీ కొద్ది రోజులుగా రాయలసీమ వాదం వినిపిస్తూ వస్తోంది. రాయలసీమకు కేంద్రం తరపున చేయాల్సిన వాటిని పట్టించుకోకపోగా… ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ.. కొత్త వాదన తీసుకొచ్చి డిక్లరేషన్ కూడా విడుదల చేశారు. అందులో రాయలసీమలో హైకోర్టు పెట్టాలనేది. ఓ ప్రధాన డిమాండ్. దేశంలో రాజధానిలో కాకుడా.. ఇతర ప్రాంతంలో హైకోర్టు ఉన్న రాష్ట్రం ఏదీ లేదు. ఆ విషయం బీజేపీకి తెలియనిదేమీ కాదు. అయినా సరే వాళ్లో డిక్లరేషన్ రిలీజ్ చేశారు. కానీ ప్రభుత్వం .. వాళ్ల డిక్లరేషన్‌కు.. మరో సొల్యూషన్ చూపించి.. సమస్య మొత్తం వాళ్ల మీదే నెట్టేయబోతోంది.

హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత బీజేపీ సైలెంట్ అయిపోయింది. కానీ…వాళ్లు రేపిన విషయం… హైకోర్టు వరకూ వెళ్లింది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులోనే పిటిషన్ వేశారు. ఇప్పుడా పిటిషన్ కేంద్రం దగ్గరకు వెళ్లింది. కానీ కేంద్రం మాత్రం ఏమీ చెప్పకుండా నాన్చుతోంది. రాయలసీమలో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

శ్రీభాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో హై కోర్టును ఏర్పాటు చేయాలని అభ్యర్ధిస్తూ సీనియర్ న్యాయవాది జె.నారాయణ స్వామిలో 2017లో ఉమ్మడి హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందున హై కోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని, ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. ఈ కేసు విచారణ లో ఉండగానే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు లో విచారణకు వచ్చింది.

గతంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్… ప్రత్యేకంగా ఔరంగబాద్ బెంచ్ ను ఏర్పాటు చేశారని పిటిషనర్ వాదించారు. ఆ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి అధికారాలు ఉన్నాయని, సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిని సమర్ధించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కనీసం హై కోర్టు బెంచ్ అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు.

పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి.. అసలైన క్లిష్ట సమస్య ఉంది. దీనికి .. సానుకూలగా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే.. బీజేపీని.. రాయలసీమ ప్రజలు విశ్వసించరు. అలా అని అనుకూలంగా ఇస్తే.. ఇక కేంద్రంతో సంబంధం లేకుండా.. వివిధ రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితిని కేంద్రం అసలు ఆశించదు. అందుకే… తాను తీసుకున్న గోతిలోనే బీజేపీ పడే పరిస్థితి వచ్చింది.

leave a reply