4 పెగ్గుల వోడ్కా..నేను ‘గే’ని కాను..!

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. పెళ్లి తరువాత చైతు, సామ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ‘మజిలీ’ ట్రైలర్‌పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘f..’ అంటూ తనకొచ్చిన బూతులు వాడుతూ ట్రైలర్ ఎలా ఉందో వివరించారు. ఆ వెంటనే మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నాగ చైతన్యపై ప్రేమ కురిపించారు. ట్రైలర్‌లో సమంత కన్నా నాగచైతన్యే చాలా బాగున్నారని పేర్కొన్నారు.

”అవును నాగచైతన్య, ఇంతకముందు ట్వీట్ చేసేటప్పటికీ నేను నాలుగు పెగ్గుల వోడ్కా తాగాను. కానీ.. ఒకవేళ నేను వోడ్కా తాగుండకపోతే పరిస్థితి వరస్ట్ గా ఉండేది. అసలు విషయం ఏంటంటే.. ట్రైలర్ లో సమంత కంటే నువ్వే బాగా నచ్చావు. నేను ‘గే’ని కాను.. అసలు నిజం ఏంటంటే.. ఆమెను నీకంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ కాసేపటికే వైరల్ అయిపోయింది. దీనిపై నాగచైతన్య కూడా స్పందించారు. అయితే, కాసేపటికే ఆ రెండు ట్వీట్లను వర్మ డిలీట్ చేసేశారు.

leave a reply