అవసరం ఉందనిపిస్తే అడుగుతా..!

కంగనాతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న మాట నిజమే.. అందుకనీ ఎప్పటికీ మేము కలిసి పనిచేయలేం అని అనేసుకుంటే ఎలా..? ఇప్పటి వరకూ ఆమెను హీరోయిన్‌గా కావాలని ఏ హీరో కానీ, డైరెక్టర్‌ కానీ తనను అడిగింది లేదని అంటున్నారు బాలీవుడ్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్. ఇప్పటివరకు కంగన కరణ్‌ తీసిన సినిమాల్లో నటించలేదు. అదీకాకుండా అప్పట్లో కంగన కూడా కరణ్‌కు రిలేషన్స్‌ సెంటిమెంట్‌ ఎక్కువ అంటూ కామెంట్స్‌ చేసింది. దాంతో వీరి మధ్య మరిన్ని విభేదాలు తలెత్తాయి.

 ‘నాకు కంగనతో ఎలాంటి సమస్యలు లేవు. నా సినిమాకు కంగన అవసరం ఉందనిపిస్తే తప్పకుండా ఆమెను తీసుకుంటాను. ఇప్పటివరకు నేను నిర్మించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో కంగనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు లేవు. నా అభిప్రాయం ప్రకారం.. ఏ దర్శకుడు కంగనను తీసుకుందామని నన్ను అడిగింది లేదు. ఏ హీరో కూడా ఆమె కథానాయికగా కావాలని అడగలేదు. దానికి నన్నేం చేయమంటారు..?  అంటూ ఇటీవల ఓ ఇంటర్య్వూలో తెలిపారు.

leave a reply