ఈ వీడియోస్‌ చూస్తుంటే సో హ్యాపీ

ప్రస్తుతం ట్రెండింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చిన్నప్పటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. కాగా.. విజయ్‌ అభిమాని సతీష్‌ అనే వ్యక్తి ఓ బాలుడు మాట్లాడుతున్న వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి.. ట్యాగ్‌ ఇస్తూ ‘ఈ అబ్బాయి విజయ్‌ దేవరకొండనా..?’ అని అడుగుతూ పోస్ట్‌ చేశాడు. అలాగే మరో అభిమాని ఆ చిన్నప్పుడు విజయ్‌ మాట్లాడుతున్న మాటలను రీమిక్స్‌ చేసి ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో ఒక సీన్‌కు యాడ్‌ చేసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇవి చాలా వైరల్‌ అవుతున్నాయి.

అయితే.. వీటిపై యంగ్‌ హీరో విజయ్‌ స్పందించి ఆ చిన్నప్పుడు అబ్బాయి విజయ్‌నే ఇప్పుడు స్టార్‌ అయ్యాడు. అలాగే.. అర్జున్‌ రెడ్డి సినిమాలో డైలాగ్స్‌ రీమిక్స్‌ కూడా చాలా ఫన్నీగా ఉంది. ‘ఆ గొంతు నాదే అయితే ఎంత బాగుండో.. నా చిన్నప్పటి గొంతును మళ్లీ వింటే బాగుంటుంది’ అని సమాధానమిస్తూ.. థ్యాక్యూ సో మచ్‌ ఇలాంటి వీడియోస్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మరోక విషయం ఏంటంటే.. ఈ వీడియోస్‌ అమ్మకు కూడా చాలా నచ్చాయి. ఇవి చూసి అమ్మ చాలా సంతోషంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు.

కాగా.. రీసెంట్‌గా విజయ్‌ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రెడ్‌’ సినిమాలో బిజీగా ఉన్నాడు.

leave a reply