దాల్చిన చెక్కతో ముఖ సౌందర్యం!

మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్క కేవలం వంటల కోసమే కాకుండా చర్మ సౌందర్యం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖంఫై మచ్చలను పోగొడుతూ…మొటిమలను కూడా తగ్గిపోయేలా చేస్తుంది. అంతేకాక చర్మ రంద్రాలలో చేరే మట్టిని మలినాన్ని తొలిగించి ముఖం మెరిసేలా చేస్తుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ముందుగా మూడు చెంచాల పాలను తీసుకొని, అందులో వంటసోడా, చెంచా తేనె, విటమిన్‌ ఇ నూనె, పావు చెంచా దాల్చినచెక్క పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంచం సేపు ఆలా ఉచి తరువాత వేళ్లతో మృదువుగా మర్దన చేసుకుని చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు.  అంతేకాకుండా చెంచా ఓట్స్‌ పొడి, రెండు చెంచాల పాలు, పావు చెంచా  దాల్చినచెక్క పొడిని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత మర్దన చేస్తూ రుద్దుతూ కడిగిన చర్మం మృదువుగా తయారవుతుంది.

 ఇంకోవిధంగా చెంచా చొప్పున దాల్చిన చెక్కపొడిలో తేనె, పావుకప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో చేతిని ముంచి ముఖంపై మృదువుగా మర్దన చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. తరువాత వేణ్నీళ్లలో ముంచిన తువాలును ముఖానికి అద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

చివరగా చెంచా దాల్చిన చెక్క పొడికి రెండు చెంచాల నిమ్మరసాన్ని కలపాలి. ఈ  మిశ్రమాన్ని దూది సహాయంతో  ఉండన మొటిమలపై పూసుకోవాలి. ఆరిన తరువాత  కడిగేస్తే సరిపోతుంది.

leave a reply