గుండె వేగం తగ్గించుకోండి!

నిత్యం మనం చేసే వ్యాయామాలలో గుండె వేగం పెంచే వ్యాయామాలతోపాటు గుండెకు విశ్రాంతినిచ్చే వ్యాయామాలు చేయాలి. గుండె మన శరీరమంతా రక్తాన్ని పంప్‌ చేస్తూ అలసిపోయే గుండెకు నిద్రించే సమయంలో తప్ప విశ్రాంతి దొరకదు. మనం వేసే భంగిమల్లో గుండె వేగాన్ని పెంచే వాటిని వేస్తుంటాం. అయితే రక్తప్రసార వేగాన్ని తగ్గించి గుండెకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతినిచ్చే భంగిమలు కొన్ని ఉన్నాయి. వాటితో గుండెకు ఉపశమనం కలుగుతుంది. ఈ వ్యాయామం కోసం ప్రతి రోజు కొంచం సమయం కేటాయిస్తే సరిపోతుంది.

ఇందుకోసం ముందుగా గోడకు దగ్గరగా వెల్లకిలా పడుకోవాలి. అనంతరం మోకాళ్లను మడిచి తరువాత పైకి లేపి, పిరుదులు గోడకు తగిలేలా చూసుకోవాలి. చేతులను వెనక్కి వాల్చేసి, కాళ్లను నెమ్మదిగా నిటారుగా పైకి లేపాలి. పైకి లేపిన కాళ్లను గోడకు ఆనించి, బరువును గోడ మీదే ఉండేలా చేయాలి

ఈ భంగిమలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని, శ్వాసను తీసుకోవాలి. ఆ సమయంలో గుండె వేగం తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది. ఇలా అయిదు నిమిషాలపాటు ఉండి నెమ్మదిగా కాళ్లను కిందకి దించి, చేతులు నేల మీద ఉంచి పైకి లేవాలి. ఇలా చేసినట్లయితే గుండె ఆరోగ్యంగా తయారవుతుంది.

leave a reply