నిజమే..! ఆగ్రహించిన సుప్రీంకోర్టు

గతంలో ఈన్యూస్‌ బాగా వైరల్ అయింది. అవునని కొందరు.. కాదని కొందరు.. కాని మొత్తానికి నిజమే అని నెస్లే మ్యాగీ సంస్థనే ఒప్పుకుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ న్యూడుల్స్‌లో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని దాని తయారీ సంస్థ నెస్లే ఇండియా అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. మ్యాగీ న్యూడుల్స్‌లో అత్యంత ప్రమాదకరమైన సీసం అవశేషాలు ఉన్నట్టు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్ఐ) గతంలోనే తేల్చింది.

అయితే.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు గాను నెస్లే ఇండియాకు భారీ జరిమానా విధించి, మ్యాగీ న్యూడుల్స్‌ను పరీక్షించాలంటూ సుప్రీంకోర్టు సీఎఫ్‌టీఆర్‌ఐని ఆదేశించింది. వాటిని పరీక్షించిన సీఎఫ్‌టీఆర్‌ఐ న్యూడుల్స్‌లో సీసం వంటి పదార్థాన్ని ఉపయోగిస్తున్నారని తేల్చింది.

అందుకు.. సుప్రీంకోర్టు ఆగ్రహిస్తూ.. ఇలాంటి న్యూడుల్స్‌ను ఎందుకు తినాలంటూ నెస్లే తరపు న్యాయవాదిని ప్రశ్నించాగా. దాని నెస్లే సంస్థ తరుపు న్యాయవాది బదులిస్తూ.. ప్రభుత్వం చెబుతున్నట్టు మ్యాగీ న్యూడుల్స్‌లో సీసం ఉన్నప్పటికీ అది అనుమతించిన మోతాదులోనే ఉందని పేర్కొన్నారు. అయితే, అది ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) కాదని కోర్టుకు తెలిపారు. దీంతో  ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన కేసును విచారించేందుకు జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది.

leave a reply