‘దేవ్‌’ సినిమా రివ్యూ

`ఆవారా`, `నా పేరు శివ‌`, `యుగానికొక్క‌డు`, `ఖాకి` వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో కార్తీ. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు సమాంతరంగా విడుదలవుతాయి. ఎప్పుడూ భిన్నమైన క్యారెక్టర్స్‌ ఎంచుకునే కార్తీ ఈ సారి రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవ్‌` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన న‌టన‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ హీరో దేవ్‌గా ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

స్టోరీ : కార్తీక్‌కి సాహ‌సాలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఫ్రెండ్స్‌ జాలీగా ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. ఈ టైంలోనే ఫేస్‌బుక్ ద్వారా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప‌రిచ‌యం అవుతుంది. రకున్‌ని చూసిన తొలిచూపులోనే కార్తీ ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ రకుల్‌ చాలా భిన్నమైన మనస్థతత్వం ఉన్న అమ్మాయి. వాళ్ల నాన్న చిన్నప్పుడే వాళ్లను వదిలేసి వెళ్లిపోతే.. కష్టపడి ఒక మంచి బిజినెస్‌ ఉమెన్‌గా ఎదుగుతుంది. ప్రేమ‌, స్నేహం.. వీటికి తను పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వదు. పైగా చిన్న‌ప్ప‌టి నుంచీ నాన్న లేకుండా పెర‌గ‌డం వ‌ల్ల మ‌గాళ్లన్నా, ప్రేమ‌ల‌న్నా.. న‌మ్మ‌కం ఉండ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో దేవ్‌, మేఘ‌న ఎలా క‌లిశారు? వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పులు సంభ‌వించాయి? అనేదే క‌థ‌.

ఎలా చేశారంటే : రకుల్‌ ఇప్పటివరకూ ఇలాంటి సీరియస్‌ క్యారెక్టర్‌ చేయలేదు. ఒక సీరియస్‌ బిజినెస్‌ ఉమెన్‌ పాత్రలో రకుల్‌ బాగా నటించింది. అలాగే.. ఆవారాగా, అడ్వాంచర్స్‌ చేస్తూ ఉండే అబ్బాయిగా కార్తీ బాగా యాక్ట్‌ చేశాడు. అలాగే రమ్యక్రిష్ణ, ప్రకాశ్‌ రాజ్‌లు కనిపించేది కొద్దిసేపయినా బాగానే మెప్పించారు. మిగిలివారంతా వాళ్ల క్యారెక్టర్స్‌ తగ్గట్టు యాక్టింగ్‌ చేశారు.

చివరకు : ఇలాంటి సింపుల్‌ స్టోరీని కార్తీ ఎలా ఒప్పుకుని చేశాడో తెలీదు. సినిమాలో అస్సలు కథనే లేదు. మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను పుట్టించే సీన్స్‌ ఎక్కువగా సాగదీశాడు. దేవ్‌ పాత్రకు బలం లేదు. చాలా సింపుల్‌ స్టోరీగా అనిపించింది. రకుల్‌ల్లోని గ్లామర్‌ మిస్సయింది. రమ్యక్రిష్ణ, ప్రకాష్‌ రాజ్‌లు వంటి యాక్టర్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పెద్దగా ఆకట్టుకోలేదు. సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా అంతగా అభిమానిని అటాచ్‌ చేయలేకపోయాయి.

leave a reply