చిటికెలో మెరిసిపోండిలా..

ఎప్పుడూ ఫ్రెష్‌గా, అందరి కంటే అందంగా, భిన్నంగా ఉండాలని ప్రతీ ఆడపిల్లకి ఉన్న కోరిక. కానీ మన చేతుల్లో కూడా కొన్ని టెక్నిక్స్‌ ఉంటాయి. మనకి మనల్నే పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరంలో, ముఖంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అందంగా ఉండాలని ఎవరైనా ఉంటుంది.. కానీ దానికి తగ్గట్టుగా కష్టపడాలి కూడా.. కానీ ఎక్కువ కష్టపడకుండా చిన్న చిన్న టిప్స్‌తో జాగ్రత్త పడండి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ కాలమైనా చర్మం నల్లబడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. చర్మంపై మలినాలు పేరుకోవడం వల్లే ఈ సమస్య. మలినాలు సులువుగా తొలగిపోయి చర్మానికి కాంతి రావాలంటే… రెండు కప్పుల నీళ్లలో మూడు టీ స్పూన్ల కాఫీ గింజలు, టీ స్పూన్‌ ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి. కప్పు కాఫీ అయిన తర్వాత దించి, చల్లారనివ్వాలి. ఈ కాఫీతో శరీరమంతా స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే కాకుండా, మాయిశ్చరైజర్‌ లభించి పొడిబారడం సమస్య తగుతుంది.

అరకప్పు అరటిపండు గుజ్జు, టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ అలొవెరా జెల్, టీ స్పూన్‌ పెరుగు, గుడ్డులోని తెల్లసొన.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాలు సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత తడి బట్టతో పూర్తిగా తుడిచేసి, శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం మృదువుగా అవుతుంది. మూడు టేబుల్‌ స్పూన్ల నారింజ రసం, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టీ స్పూన్‌ బాదం నూనె, టీ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్‌ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

leave a reply