ఆ ట్వీట్స్‌.. నావి కావు

యాక్టర్స్‌ ఫోన్స్‌, ట్విట్టర్‌లు హ్యాక్స్‌ అవడం చాలా కాలం నుంచి వింటున్న వార్తలే. ఏంటి..? మళ్లీ ఎవరి ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది అని అనుకుంటున్నారా..? హీరోయిన్‌ హాన్సిక ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. మొన్న అక్షరా హాసన్‌.. నిన్న అమీ జాక్సన్‌.. ఇప్పుడు హన్సికది. దాంతో ఆమె ప్రైవేట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హన్సిక ఫోన్‌ని హ్యాక్‌ చేసిన వ్యక్తులు ఆమె టూ పీస్‌ బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు హన్సిక. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

‘నా ఫోన్‌, ట్విటర్‌ అకౌంట్‌ రెండు హ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్‌ ఖాతాలో వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం హన్సిక న్యూయార్క్‌లో విహార యాత్రలో ఉంది. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇది హన్సిక నటిస్తున్న 50వ సినిమా.

leave a reply