ఈ తప్పంతా మీడియాదే..? సాగదీస్తారు..!

ఈ తప్పంతా మీడియాదే అని ఫైర్ అయ్యారు మెగా బ్రదర్‌ నాగబాబు. బాలకృష్ణ గురించి అడిగితే సరదా కోసం తెలియదని అన్నానని దాన్ని మీడియానే పెద్దది చేసిందని, అయ్యో ఆయన తెలియదా అంటూ రాగాలు తీసిందని అందుకే తాను ఓ సిరీస్ స్టార్ట్ చేసి మరీ మీడియాకు బదులిచ్చానని చెప్పారు నాగబాబు. కేవలం మీడియాకి ఆన్సర్ చేసేందుకే సిరీస్ స్టార్ట్ చేశానన్నారు.

కానీ.. ఒకటి కాదు, రెండుకాదు.. ఆరుసార్లు అదేపనిగా మమ్మల్ని టార్గెట్‌ చేసి అంటుంటే ఎవరికైనా బాధ వేస్తుందని వివరణ ఇచ్చారు. కారణం లేకుండా మిమ్మల్ని పదే పదే కొడితే మీరు మాత్రం స్పందించకుండా ఉంటారా అంటూ సదరు యాంకర్ ని ప్రశ్నించారు నాగబాబు. 6 సార్లు తమని అన్నందుకు, 6 సార్లు బదులిచ్చేశానని, ఇక ఈ వివాదం ముగిసిపోయినట్టేనని సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు నాగబాబు.

leave a reply