అసలు ఎవరా విలన్‌..?

ఒక్క ‘ఎన్‌టి‌ఆర్’ అనే పదాన్ని స్టోరీ లైన్ గా తీసుకుని దాదాపుగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రముఖ తెలుగు తార, తెలుగు దేశం పార్టీ అధినేత, స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి‌ఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ లపై బయోపిక్ లు సిద్ధమవుతున్నాయి. ‘కథానాయకుడు’ అంటూ ఇది వరకే డైరెక్టర్ క్రిష్ ఎన్‌టి‌ఆర్ జీవిత ప్రస్థానంలో భాగంగా ఆయన కథానాయకుడి నుండి రాజకీయ అరంగేట్రం వరకు జరిగిన సన్నివేశాల్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ సినిమాకి ఎంత కష్టపడ్డా అంతగా కలెక్షన్లు రాలేకపోయాయి. కానీ హైప్ మాత్రం క్రియేట్ చేయగలిగింది. ఆపై ‘మహానాయకుడు’ అంటూ రెండవ భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు త్వరలో విడుదల చేయనున్నారు . దీనికి పోటీగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ అని.. మరో దర్శకుడు లక్ష్మీస్ వీర గ్రంధం అంటూ సినిమాల్ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అసలు ఎవరిది వాస్తవ కథ..? నిజమైన బయోపిక్ ఎవరు తీస్తున్నారు..? అనే ప్రశ్నతో ప్రేక్షకులు తికమక పడుతున్నారు. ప్రతీ ఒక్కరూ మాదే అసలు కథ అనడంతో ఎవరిని నమ్మాలో అర్ధం కానీ పరిస్థితి. ఎవరి సినిమా లో నిజాన్ని చూపిస్తున్నారో తెలియట్లేదు.

ఎన్నికల సంధర్బంగా రాజకీయ లబ్ధి గురించి కథని మారుస్తున్నారా అనే ప్రశ్నలు కూడా కలుగుతున్నాయి. పార్టీ వారి ఫ్రమేయం వల్ల కథని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారా..? ఈ ప్రశ్నలకి ప్రేక్షకులే సమాధానం వేతుక్కోవాలి అనట్టుగా మారింది. తాజాగా విడుధల అయిన మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్.. ట్రైలర్లు చూస్తుంటే ఎవరు విలన్లో ఎవరో హీరోలో తెలియట్లేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వెన్నుపోటు ఎపిసోడ్ నే హైలెట్ గా చూపించానంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 మహానాయకుడు లో కూడా వెన్నుపోటునే ప్రధానాంశంగా తీసుకున్నారు. అసలు ఏం వెన్నుపోటు ఉండబోతుందో వేచి చూడాలి. వర్మ సినిమాలో చంద్రబాబు పోటు పొడిస్తే, క్రిష్ మూవీలో ఆ రోల్ నాదెండ్ల భాస్కర్ రావుకి ఇచ్చారు. వర్మ సినిమాలో చంద్రబాబు విలన్ అయితే, బాలయ్య సినిమాలో బాబే హీరో. ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా ఎన్టీఆర్ కి అండదండగా, నాదెండ్ల కుట్రని ఛేదించే హీరోగా చంద్రబాబు క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు.

leave a reply