వాడ్ని నమ్మడం నేను చేసిన తప్పు

ట్విట్టర్ వేదికగా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’మూవీ ట్రైలర్ని లాంచ్ చేసారు రాంగోపాల్ వర్మ. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. నిజాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు వర్మ. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత నుంచి ఆయన జీవితం ఎలా మారింది అన్న కోణంలో రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోషల్ మీడియాను బాగా వాడుకుని ఈ సినిమాకి పాపులేషన్ బాగానే పెంచేసుకుంటున్నారు వర్మ.

‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’.. అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల జీవితంలో జరిగిన ఎన్నో ఎమోషనల్ సీన్స్‌ను ఈ టీజర్‌లో చూపించారు. ఎన్టీఆర్‌‌పై చెప్పులు విసరడం.. అనంతరం ఆయన ఇంటికి వచ్చి కుప్పకూలిపోవడం వంటి ఎమోషనల్ సీన్స్‌ను వర్మ చూపించారు. ‘నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నేను నమ్మడం’ అంటూ ఎన్టీఆర్ కన్నీళ్లతో చెప్పడంతో ట్రైలర్ పూర్తవుతుంది.

leave a reply