ఎలర్జీస్‌ను తగ్గిస్తుందట

‘రోజ్‌ వాటర్‌’ ఇది అందరికీ తెలిసిన పదార్థమే. ముఖ్యంగా మహిళలు, యువతులు గులాబీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు ఉపయోగింస్తూంటారు. సహజ సిద్ధంగా లభించే ఈ రోజ్‌ వాటర్‌ను బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో ఎక్కువగా వాడుతూంటారు. దీని వల్ల చాలా లాభాలున్నాయని స్కిన్‌ స్పెషలిస్టులు సైతం చెప్తున్నారు. కొంతమంది ఈ వాటర్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని, వాడుతూంటారు.

రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. దీని కారణంగా ఇది గాయాలను, చిన్న చిన్న దెబ్బలను నయం చేయడానికి తోడ్పడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్‌కు ఉంది. కళ్ల వాపులను తగ్గిస్తుంది. సన్ బర్న్ అయితే ఆ ప్రదేశంలో కొంత రోజ్ వాటర్‌ను రాస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్‌ను రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరం దుర్వాసన రాకుండా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని చుక్కలు రోజ్‌ వాటర్‌ నీటిలో వేసుకుని స్నానం చేస్తే దుర్వాసనను దూరం చేస్తుంది.

మహిళలు కళ్లకు వేసుకునే మేకప్‌ను రోజ్ వాటర్‌తో సులభంగా తొలగించుకోవచ్చు. రోజ్ వాటర్, జోజోబా ఆయిల్‌లను సమభాగాలుగా తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేసిన తరువాత గుడ్డతో తుడవాలి. మొటిమలు ఉన్నా,  చర్మం దురదగా ఉన్నా ఆ ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటిని రాయాలి. ఇది ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది. జాస్మిన్ ఆయిల్‌లో కొద్దిగా రోజ్ వాటర్‌ను మిక్స్ చేసి శరీరానికి రాస్తే శరీరం నుంచి వెలువడే దుర్వాసన తగ్గుతుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ కళ్ల కింద వాపు, డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మర్దనా చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

leave a reply