అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా..

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అమ్మాయిలు, అబ్బాయిలు టీనేజ్‌లో ఉన్నప్పుడు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల టిప్స్‌ని ఫాలో అయే ఉండి ఉంటారు. అందం అమ్మాయిల సొత్తే కాదు.. మనకు కనిపించకుండా అబ్బాయిలు కూడా చాలా రకాలుగా ట్రైల్స్‌ వేస్తూ ఉంటారు. కూల్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపించడానికి అబ్బాయిలు చేసే ప్రయత్నాలు వర్ణణాతీతమనే అనాలి. మనకు కావాల్సిన లుక్‌ కావాలంటే కొంచెం కష్టపడాలి కదా..

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. అబ్బాయిలు కూల్‌ అండ్ స్టైలిష్‌గా కనిపించాలంటే ఎలా..? దాని గురించే తెలుసుకోబోతున్నాం.. ఈపాటికే అబ్బాయిలు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉండి ఉంటారు. ఓసారి ఈ క్రింది టిప్స్‌ను కూడా ట్రై చేయండి మరి.

ఎవరైనా ముందు మన ఫేస్‌ను చూస్తారు. తరువాత బాడీ, ఆ తరువాత కాళ్లను చూస్తారు. మన ఫేస్‌ కళగా ప్రశాంతంగా కనిపించాలంటే.. అందులో చాలా ముఖ్యమైనది నిద్ర. సరిపడనంత నిద్ర లేకపోతే కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ వచ్చి నల్ల మచ్చులగా కనిపిస్తాయి. ఇది చూడటానికి అంత ఆకర్షణగా ఉండదు. కళ్లు ఎప్పుడూ తాజాగా, మెరుస్తూ కనిపించాలంటే కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ కనిపించకుండా చూసుకోవాలి.

ఆ తరువాత బాడీ ఫిట్‌నెస్‌. దీని గురించి అబ్బాయిలకు చెప్పనవసరంలేదని అనుకుంటున్నా.. ఎందుకంటే ప్రతీ అబ్బాయి జిమ్‌ వర్క్‌ అవుట్స్‌ గురించి కంపెల్సరీగా తెలుసుకునే ఉండి ఉంటారు. వీటితో పాటు మార్నింగ్‌ వాకింగ్‌, మెడిటేషన్‌ కూడా చేస్తే బాడీ ఫిట్‌గా, ఫేస్‌ ప్రశాంతంగా మెరుస్తూ ఉంటుంది. దీనితో పాటు తగిన ప్రోటీన్‌ ఫుడ్‌ను కూడా తీసుకోవాలి. ఎప్పుడూ మాంసాన్నే కాదు అప్పుడప్పుడు ఫ్రూట్స్‌, జ్యూసెస్‌, పాలు, ఆకుకూరలు ఇలా తీసుకుంటూ ఉంటే ఏ అబ్బాయి అయినా హ్యండ్‌సమ్‌గా కనిపించాల్సిందే.

జాగింగ్‌ అండ్‌ వాకింగ్‌, వర్క్‌ అవుట్స్‌ వల్ల మనకు తెలియకుండానే మన ముఖం కళను సొంతం చేసుకుంటుంది. అలాగే రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలాగే.. మెదడు కూడా చురుకుగా పనిచేస్తూ మంచి మంచి ఐడియాలను మనకు వచ్చేలా చేస్తుంది. ముందు బాడీని ఆనందంగా ఉంచితేనే అది మనల్ని ఆనందంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి కాస్త బద్దకాన్ని పక్కన పెట్టి పై వాటిని ఓ సారి ట్రై చేయగలరు.

leave a reply