భారత్‌లో పెరిగిన నిరుద్యోగం

భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికను విడుదల చేసింది.2016 తర్వాత నిరుద్యోగ సమస్య పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం (ఫిబ్రవరి -2019)నిరుద్యోగ సమస్య రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది.పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ ఒక నివేదికను జనవరిలో వెల్లడించింది. నోట్ల రద్దు అనేది నిరుద్యోగ సమస్య పెరగటానికి ఒక కారణం అని ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఏది ఏమైనా ఈ విధంగా నిరుద్యోగ సమస్య పెరగటం ఎన్నికలవేళ మోడీకి నిరాశ కలిగించే అంశమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

leave a reply