ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఏడానై మనదే

Hyper Ram Pothineni Interview Stills

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుపై యంగ్ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌ ప్రశంసలతో ముంచ్చెత్తారు. ‘ఒకప్పుడు అనంతపురంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయని నేనంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు అతిపెద్ద సంస్థ అయిన కియో కార్ల సంస్థ అనంతపురం జిల్లాకు వచ్చింది. అనంతపురం జిల్లాకు నిరంతర కృషితో నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో పెట్టుబడులకు పునాది వేశామంటూ’ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

దీనిపై హీరో రామ్‌ స్పందిస్తూ.. కియా మోటార్స్ ఏపీకి రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘అవును.. ఇది నిజమే.. ఆంధ్రప్రదేశ్‌కి ఇది మొదటి ముందడుగు అంటూ’..ట్వీట్‌ చేశాడు. అయితే.. ఈ ట్వీట్‌పై ఏపీకి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కామెంట్స్‌పై.. రామ్‌ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్.. నువ్వు చెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీట్‌.. ఆంధ్ర నాదే.. తెలంగాణ నాదే.. ఇదే మాట మీదుంటా! ఇక్కడ కులం లేద్.. ప్రాంతం లేద్.. డిస్కషన్ అస్సల్ లేద్!’’ అంటూ రామ్ పేర్కొనడంపై.. నెటిజన్లు ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం హీరో రామ్‌ నటిస్తున్న ‘ఇస్టార్ట్‌ శంకర్‌’ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. పూరీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

leave a reply