ఏ హీరోయిన్‌కి కోపమొచ్చినా ఫర్వాలేదు

సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, నటుడైన ప్రఖ్యాత ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి తెలుగు వారికి చెప్పనవసరం లేదు. అలాగే ఆయన పాటలంటే చెవికోసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ ఒద్దికతో ఉన్న ఆయన తాజాగా.. తెలుగు హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయింది. ఒప్పుడు తెలుగుదనానికి అచ్చంగా తెలుగు పరిశ్రమ ఉండేదని.. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో సంస్కృతీ, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా కార్యక్రమాలకు వేదికమీదకు వచ్చే హీరోయిన్లను చూస్తుంటే ఒళ్లు మండిపోతుందని అన్నారు. ఒక కార్యక్రమంలో ఎన్నో వేల మంది ఉంటారు. అంత మంది ముందు అలా చిన్న చిన్న బట్టలు, సగం సగం బట్టలు వేసుకుని వైదికపైకి రావడం తెలుగు సంప్రదాయానికే అవమానకరంగా ఉందంటూ ఆరోపించారు. టాలెంట్‌ అనేది వేసుకునే బట్టల్లో ఉండదని స్పష్టం చేశారు. అందుకే తెలుగు అమ్మాయిలు సినిమాల వైపు రావ‌డం లేదు. తెలుగు అమ్మాయిల‌ను హీరోయిన్లుగా తీసుకోవ‌డానికి సినిమావాళ్లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇలాంటి విష‌యాల గురించి మాట్లాడ్డానికి నేను భ‌య‌ప‌డ‌ను. ఈ కామెంట్స్‌పై ఏ హీరోయిన్‌కైనా కోపం వ‌చ్చినా ఫ‌ర్వాలేదని సింగర్‌ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.

leave a reply