‘118’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్, నాజ‌ర్‌, రాజీవ్ క‌న‌కాల, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌,ప్ర‌భాస్ శ్రీను తదితరులు
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
నిర్మాత‌: మ‌హేష్ కొనేరు
ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌

క‌థ‌:
గౌతమ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ గా ఓ చానెల్‌లో ప‌నిచేస్తుంటాడు.ఓకానొక సంద‌ర్భంలో గౌత‌మ్ ఓ రిసార్ట్ లో 118 అనే రూమ్‌లో స్టే చేస్తాడు.ఆ రాత్రి 1.18 నిమిషాల‌కు అత‌నికి ఓ క‌ల వ‌స్తుంది. ఆ కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంటుంది. కొంతమంది దుండగులు ఆమెను చంపాలనుకోవడం, ఓ కారుని లోయలోకి తోసేయడం, ఇదీ ఆ కల. అస‌లు ఆ క‌ల ఏంటి? ఎందుకు వ‌చ్చింది? క‌ల‌లో ఉన్న అమ్మాయి ఎవ‌రు?ఆ అమ్మాయికి వచ్చిన ఆపద ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. కలలో తాను చూసిన ప్రతీ ప్రదేశం నిజ జీవితంలోనూ తనకు తారసపడుతుంటుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా ఉండే ఉంటుంది అని గౌతమ్‌ గట్టిగా నమ్మి,ఆమెకు వచ్చిన ఆపద ఏంటి అని వెతికే పనిలో ఉంటాడు. ఈ ప్రశ్నల సమూహమే 118.

ఎవరెలా చేశారంటే…

కల్యాణ్‌రామ్‌ ఇంతకూ ముందు ఎప్పుడు చేయని పాత్రలో మనకు కనిపిస్తాడు. గౌతమ్‌ ప్రియురాలి పాత్రలో షాలినీ పాండే నటించింది. తన పాత్రకు న్యాయం చేసింది. నివేదా థామస్‌ స్క్రీన్ మీద కనిపించేది కొంచెం సేపు అయిన తన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన వారు ఎవరికీ వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

చివరిగా సినిమా ఎలా ఉంది అంటే ఓ కల చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంటుంది. కలలో వచ్చిన ఆధారాలను బట్టి కథానాయకుడు ఓ అన్వేషణ మొదలు పెడతాడు. తన ప్రయాణంలో తనకు అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం వాటిని కధానాయకుడు ఎలా అధిక మించాడు అనేదే ఈ 118, ఇది ఓ థ్రిల్లర్ సినిమా అని చెప్పవచ్చు.

leave a reply