ఆహార ధాన్యాలతోనే… ఆరోగ్యం!

వైద్యం, ఆరోగ్యం కోసం న్యూట్రీషన్’ అనే అంశంపై బుధవారం కింగ్‌ కోఠిలోని షాలీమార్‌ ఓ ఫంక్షన్‌ హాల్‌లో సెమినార్‌ నిర్వహించగా. ఈసెమినార్‌లో ప్రముఖ  ట్రూవెయిట్‌ చీఫ్‌, న్యూట్రీషియనిస్టు సుహాసినీ ముద్రగనం హాజరయ్యారు. సుహాసినీ ముద్రగనం మాట్లాడుతూ రైతులు పండించే ఆహార ధాన్యాలతోనే ఆరోగ్యానికి హాని లేదని చెప్పారు. రైతులు పండించే ఆహారధాన్యాలు ప్రస్తుత మానవుల జీవన శైలికి యోగ్యమని ఆమె తెలిపారు.ఈ ఆహార ధాన్యాలు  శారీరక సామర్థ్యాన్ని పెంచుతాయని వివరించారు.

ఫ్యాబ్రికేటెడ్‌ ఉత్పత్తితో వచ్చే ఆహార పధారాధలు ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ప్రముఖ శాత్రవేత్త  డాక్టర్‌ టి.జ్యోతిర్మయి మాట్లాడుతూ న్యూట్రీషిన్స్ సమతుల్యత క్రమం తప్పకుండ పాటించాలని, ఆలా పాటించని వారిలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఊబకాయం తదితర హానికరమైన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు.  

leave a reply