చెల్లికే లేనప్పుడు నాకెందుకు..?

నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గన్‌మెన్లను తిరస్కరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఇప్పటికే బ్రహ్మానందరెడ్డి సోదరి.. మంత్రి అఖిల ప్రియ గన్‌మెన్లను తిరస్కరించగా ఇప్పుడీయన కూడా అదే తరహాలో పోలీసు భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారు.

కాగా.. రెండు రోజుల క్రితం తన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు చేసిన దాడులను నిరసిస్తూ ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తన సెక్యూరిటీ వెనక్కి పంపారు. అయితే.. అదేబాటలో సోదరుడు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా పర్సనల్‌ సెక్యూరిటీని వెనక్కి పంపేసారు. తన చెల్లికే సెక్యూరిటీ లేనప్పుడు నాకు అవసరంలేదని తేల్చి చెప్పేసారు.

leave a reply