ఆ రెండు జట్లే… వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌!

వన్డే వరల్డ్‌కప్‌కు అంతా సిద్దమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ… ఈ సారి తక్కువ అంచనాలతో బరిలో దిగుతున్నామని వివరించాడు. ప్రతిసారి భారీ అంచనాలతో ఈ మెగా టోర్నీలో పాల్గొన్న మాకు చివరకి నిరాశే మిగిలిందని డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. దీనితో తక్కువ అంచనాలతో మాత్రమే ఈసారి వరల్డ్‌కప్‌కు సిద్ధమైనట్లు తెలిపాడు. అయితే ఈ ఏడాది జరగబోయే వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని ,ఆ జట్టుతో పాటు మరో జట్టు టీమిండియా కూడా ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడట. ప్రస్తుత టీం ఇండియా అద్భుత ఫామ్ కొనసాగిస్తుందని పేర్కొన్నాడు. అయితే ఈ సారి సాధ్యమైనంత వరకూ తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అన్నివిధాలా కష్టపడతామని చెప్పాడు. గతంలో ఫేవరెట్స్‌గా వరల్డ్‌కప్‌కు ఆడిన ప్రతీ సందర్భంలో మేం విఫలమయ్యాం అని వివరించాడు.

ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో ఉందని, వారంతా వరల్డ్‌కప్‌ సిద్ధంగా ఉన్నారని, వీలైనంతవరకు తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెడతామని. కచ్చితంగా వరల్డ్‌కప్‌ గెలవాలని మాత్రం ఇంగ్లండ్‌కు వెళ్లట్లేదని చెప్పాడు. వరల్డ్ కప్ అంటే భారీ అంచనాలు ఉంటాయని వాటిని అందుకోవడం కష్టమని తెలిపాడు. ప్రస్తుతం మా జట్టు బలహీనంగా ఉందని అందుచేత భారీ అంచనాలను పెట్టుకోలేదు అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. గతంలో నాలుగుసార్లు సఫారీలు సెమీ ఫైనల్‌ వరకూ వెళ్లినా వరల్డ్‌కప్‌ను గెలవడంలో విఫలమయ్యారు.

leave a reply