ఇడియట్‌..! అన్నారా.. ఐపోయారే..

People are seen as silhouettes as they check mobile devices whilst standing against an illuminated wall bearing WhatsApp Inc's logo in this arranged photograph in London, U.K., on Tuesday, Jan. 5, 2016. WhatsApp Inc. offers a cross-platform mobile messaging application that allows users to exchange messages. Photographer: Chris Ratcliffe/Bloomberg

అబుధాబిలో చట్టాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సరదాగా ఒక మాట అన్న అది అక్కడతప్పు అయిపోతుంది. ఇప్పుడు ఓ వ్యక్తికి అదే పరిస్థితి ఎదురైంది. తనకు కాబోయేభార్యను సరదాగా ‘ఇడియట్‌’ అన్నందుకు గానుఅతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఖలీజ్‌ టైమ్స్‌ కథనం ప్రకారం ఓవ్యక్తి తనకు కాబోయే భార్యకు వాట్సాప్‌లో ఇడియట్‌ అని సరదాగా సందేశం పంపించాడు.దీంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. విచారించిన న్యాయస్థానం అతడికి జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది.

60 రోజుల పాటు జైలు శిక్ష, 20వేల దిర్హామ్స్‌ అంటే రూ.3.92లక్షలు జరిమానా చెల్లించాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల ద్వారాఎవరినైనా తిడుతూ అభ్యంతరకరమైన సందేశాలు పంపించడం చేస్తే అది అక్కడ సైబర్‌ క్రైమ్‌కింద నేరం. సరదాగా అన్న మాటకు అతడు సుమారు రూ.మూడున్నర లక్షల మేర జరిమానాచెల్లించుకోవాల్సి వచ్చింది. ఇలా సందేశం పంపించిన వ్యక్తికి భారీగా జరిమానావిధించడం అక్కడ ఇదేమి తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో నివసించే బ్రిటిష్‌సిటిజన్‌ ఒకరు తన కార్‌ డీలర్‌ను తిడుతూ సందేశం పంపించాడు. దీంతో అతడిని అరెస్టుచేసి జైల్లో పెట్టారు.

leave a reply