మంచి నిద్రతో… మంచి ఫలితాలు.!

పరీక్షల సమయంలోరాత్రి వేళ బాగా నిద్రపోయే వారికి మంచి మార్కులు వస్తుంటాయి.

చాలా మంది విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో నిద్ర లేకుండా చదువుతుంటారు. సంవత్సరం  పొడవునా ఎలా ఉన్న పరీక్షా సమయాలలో నిద్రకు తక్కువ సమయం కేటాయించి ఎక్కువ సమయం  చదువుతుంటారు పది రోజులలో పరీక్షలు మొదలవుతాయనగా రాత్రి సమయంలో మేల్కొని చదువుతుంటారు . అయితే ఇలా చదవడం వల్ల పెద్దగా లాభం ఉండదని , పరీక్షల సమయంలో రాత్రి వేళ బాగా నిద్రపోయే వారికి మంచి మార్కులు వస్తాయని అమెరికాలోని బేలర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరీక్షల ముందు ఎంత చదివినా నిద్రకు మాత్రం తగినంత సమయం కేటాయిస్తే పరీక్షలు బాగా రాసేందుకు ఎక్కువ  అవకాశాలు  ఉన్నాయని  పరిశోధకుడు మైకేల్‌ తెలిపారు.

leave a reply