ఎఫ్ 2 టీజర్.. అదరహో !

అనిల్ గత సినిమాల కంటే ఇది రెట్టింపు కామెడీ ఎంటర్టైనర్ గారాబోతుంది.

మల్టీ స్టార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా విక్టరీ వెంకటేష్ మరియు మెగా ఫామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్  కలిసి నటిస్తున్న ఎఫ్ 2 సినిమా టీజర్ ను విడుదల చేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అనిల్ గత సినిమాల కంటే ఇది రెట్టింపు కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

వెంకీ వరుణాల మధ్య బ్రో ,బ్రో అని పిలుచుకునే సందర్భం చాల బాగుంది కామెడీ సినిమాలలో వెంకటేష్ చాల చక్కగా  ఇమిడి పోతాడు వరుణ్ కూడా చాల చక్కగా నటించాడు వాళ్ళ కామెడీ టీజర్లోనే అదిరిపోయింది ఇంక సినిమా గురించి చెప్పక్కర్లేదు. టీజర్లో పెళ్ళికి ముందు పెళ్లి తరవాత సంగతి గురించి చెప్పే సందర్భంలో “తెలంగాణ రాకముందు  తెలంగాణ వచ్చాక ” డైలాగ్ చక్కగా అలరిస్తుంది ఇందులో వెంకీ ,వరుణ్ తోడల్లుళ్ళుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి భార్యలుగా తమన్నా ,మెహ్రీన్ లు నటిస్తున్నారు. పెళ్లి అయినా తరువాత మగవాళ్ళు పడే కష్టాలను చాల చక్కగా కామెడీ ఎలెమెంట్స్ తగ్గకుండా చూసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ పాత్ర తెలంగాణా యాసలో మాట్లాడడం మరో హైలైట్ నిలుస్తుంది. సంక్రాంతి బరిలో కన్నుల పండుగగా ఈసినిమా నిలుస్తుంది  అని చెప్పక్కర్లేదు. టీజర్ చూసాక  మీరు కూడా ఆలస్యం అమృతం పెళ్ళాం అని అంటారు.  

leave a reply