ఈ శకునం మంచిదే..

ఏదైనా ఒకముఖ్యమైన పనిమీద ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడు, శకునం చూసుకుని బయలుదేరుతూ ఉంటాం. కాస్త ఆలస్యమైనా మంచి శకునం చూసుకునే అడుగుబయటికి పెడుతూంటాం. ఇలా మంచి శకునం చూసుకుని బయలుదేరడం వలన, వెళ్లిన పని సక్సస్‌ అవుందనే విశ్వాసం పూర్వకాలం నుంచీ ఉన్న ఆచారంమని మనంచెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్లు తాము తలపెట్టే కార్యాలు విజయం కావాలని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని ఆశిస్తారు. అందుకే శకునానికి అధిక ప్రాధాన్యతనుఇస్తూంటారు.

 ఈ నేపథ్యంలోకొన్ని శకునాలు మంచివిగా.. మరికొన్ని శకునాలు అందుకు విరుద్ధమైనవిగాచెప్పబడుతున్నాయి. ఇక కార్యసిద్ధిని కలిగించే శకునాలలో పూలు – పండ్లు కనిపిస్తూవుంటాయి. సాధారణంగా దైవదర్శనానికి వెళ్లాలని అనుకోగానే ముందుగా గుర్తుకువచ్చేదిపూలు.. పండ్లే. భగవంతుడిని పూలతో అలంకరిస్తూ.. అర్చిస్తూ వుంటారు. ఆయనకివివిధరకాలైన పండ్లను నైవేథ్యంగా సమర్పిస్తూ వుంటారు.

ఇక శుభకార్యాలలోనూ పూలు – పండ్లకి ప్రధానమైన స్థానం ఇవ్వబడుతుంది. ఇవి లేకుండా శుభకార్యమనేది జరగనే జరగదు. దీనిని బట్టి పూలు – పండ్లు ఎంతటి శుభప్రదమైనవో అర్థంచేసుకోవచ్చు. అందువలన పూలబుట్టతో గానీ.. పండ్లబుట్టతో గాని ఎవరైనా ఎదురురావడం శుభసూచకంగా విశ్వసించడం జరుగుతోంది. పూలతోను.. పండ్లతోనూ.. కూడిన శకునం మంచిదిగా భావించి వెంటనే బయలుదేరవచ్చు.

leave a reply