ఉగ్రవాదుల మీద దాడుల కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందంటే..

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్‌ ధ్రువీకరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ద విమానాలు ఉగ్రవాద శిబిరాలను కేవలం 21 నిమిషాలలోనే నాశనం చేశాయి. ఈ మెరుపు దాడుల కోసం భారత వాయుసేన రూ.6,300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించిన మిరాజ్ 2000 విమానాల విలువ రూ.2,568 కోట్లు, ఉగ్ర స్థావరాలను నాశనం చేయడానికి వినియోగించిన బాంబుల ఖరీదు రూ.1.7 కోట్లు.1000 కిలోల బరువు గల లేజర్ గైడెడ్ తరహా బాంబులు ఒక్కోక్క దాని ఖరీదు రూ.56 లక్షలు ఉంటుందని రక్షణ వర్గాల అంచనా.ఈ దాడుల కోసం పెద్ద మొత్తంలో కేటాయించినా సగం కూడా ఖర్చు కాలేదు అని సమాచారం. దీనికి గల కారణం భారత వాయుసేన యొక్క సమర్థతే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

leave a reply