ఓటేసేప్పుడు మద్యంతో పాటు సిగిరెట్ కూడా

ఎన్నికలు జరిగే రోజు మద్యం దుకాణాలు మాత్రమే బంద్ చేసే ఎన్నికల సంఘం భారతదేశ చరిత్రలోనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎన్నికలు జరిగే రోజు సిగరెట్ దుకాణాలు కూడా బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు.

మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ గా వ్యవహరించే కలెక్టర్ కు ఈ ఆదేశాలు అందాయి. నిషేధం ఉన్నట్టు తెలియజేసే బ్యానర్లు కుడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. సిగరెట్, బీడి, గుట్కా, నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

దేశంలో కేన్సర్ మరణాలకు పొగాకు ఉత్పత్తులే కారణమని ఆరోగ్య శాఖ గుర్తించగా, గొంతు, దవడ, ఊపిరితిత్తులు, లివర్ క్యాన్సర్ లు రావడానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులేనని ఇటివల ఆరోగ్య శాఖ స్పష్టమైన ప్రకటన తెలిపింది. దీంతో ప్రజలకు వీటి పై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా పోలింగ్ బూత్ ల పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవచ్చు. భారత దేశంలో తొలిసారిగా 2019 పార్లెమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిబంధనను ఎన్నికల సంఘం అమలు చేస్తుండగా ఎన్నికల సంఘం నిర్ణయానికి ప్రత్యేక అభినందనలు అందుతున్నాయి.

leave a reply