శివాజీ చెప్పిన ముగ్గురెవరూ

తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు తెరవెనుక ఉండి కుట్రలు జరుపుతున్నవారిలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు ఉన్నారని సినీనటుడు శివాజీ చేసిన ప్రకటన సచివాలయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ముగ్గురు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కుమారుడు ‘లోకేష్’కు అత్యంత ఇష్టులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురిని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు’కు తగిన శాస్తి జరిగిందని వారు అంటున్నారు.

నిజాయితీ,సమర్థత, విధేయతతో ఉండాల్సిన ఐఎఎస్ అధికారులు, కుల,మత అభిమానంతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం టిడిపి మద్దతుదారులకు మింగుడుపడడం లేదు. ‘శివాజీ’ చెప్పిన ముగ్గురు అధికారులు ఎవరని మీడియాకు ఫోన్ చేసి పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురులో ఒకరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారని, మరో ఇద్దరు కీలకశాఖల్లో కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. వీరు టిడిపి అభిమానులను, సానుభూతిపరులను పలు ఇబ్బందులకు గురి చేస్తోన్నా..పాలకులు పట్టించుకోవడం లేదు. చివరకు తండ్రీ కొడుకులైన చంద్రబాబు,లోకేష్ల నెత్తికెక్కినవారెవరూ బయట లేరు.

వైకాపా,బిజెపి నేతలకన్నా ప్రమాదకరమైన ముగ్గురు ఐఎఎస్ అధికారులు కఠిన వైఖరిని అవలంభించకపోతే మరింత నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇంతకు ముందు “శివాజీ’ చెప్పిన అంశాలను పట్టించుకోని ‘చంద్రబాబు’ తరువాత ఆయన చెప్పిన మాటలు నిజం కావడంతో..ఇప్పుడు ‘శివాజీ’ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తారా..? ప్రాధాన్యత ఇస్తే..వారిని అక్కడ నుంచి బదిలీ చేస్తారా..? లేక వదిలేస్తారా..? మరో రెండు రోజుల్లో వారి పేర్లను తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తానని..’శివాజీ’ చెబుతుండడం, ఆ ముగ్గురు ఆ విధంగా చేసి ఉంటారా..? అనే భావనతో సిఎం ఉన్నట్లు తెలిసింది.

ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ఆమోదిస్తున్నారు…? తాను కూడా ఓకే అంటున్నారని..వారికేమి తక్కువ చేశారని..సీపం ప్రశ్నిస్తున్నారట. వీరిపై త్వరలో చర్యలు తీసుకుంటారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు.

leave a reply