రాఫెల్ స్కాంలో ప్రధాని మోడీని విచారించాలి: రాహుల్ గాంధీ

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చాలా అవకతవకలు జరిగాయని దీనికి పూర్తి భాద్యత మోడీదే అని రాహుల్ గాంధీ పునరుద్గాటించారు. ఈ స్కామ్ కి సంబంధించి ప్రధాని మంత్రి మోడీ ని వివహరించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి చోరీకి గురైనట్టు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు బుధవారంనాడు తెలిపారు.

కేంద్రం చెప్పిన ఈ విషయం విని విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఫ్రెంచ్ కంపెనీతో కుదుర్చుకున్న దేశ రక్షణకు సంబంధించి ఎంతో ముఖ్యమైన పత్రాలు చోరీకి గురైనట్టు చెబుతున్నారు అంటే దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.తమ దొంగతనం బయటపడుతుంది అని కేంద్ర ప్రభుత్వమే సాక్ష్యాధారాలను నాశనం చేస్తుంది అని మండిపడ్డారు.

leave a reply