కేటీఆర్‌కు నా పూర్తి మద్దతు..

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయమే కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్‌కు నా తరుపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన అన్నారు. కేటీఆర్‌ తన బాధ్యత చక్కగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలనికోరుకుంటున్నా అని కేటీఆర్‌ను కలిసిన తర్వాత మీడియా సమావేశంలో తెలిపారు హరీష్‌రావు. టీఆర్‌ఎస్‌ను మరింతగా బలోపేతం చేయాలని.. దానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవలజరిగిన ఎన్నికల్లో తాను, కేటీఆర్‌ కలిసి పనిచేశామని, రాష్ట్రాన్నిముందుకు తీసుకుపోవడంలోనూ కలిసే పనిచేస్తామని చెప్పారు.

leave a reply