కధానాయకుడుకి…అన్ని ఓకే!

ఈ సారి సంక్రాంతి బరిలో  ఎన్టీఆర్  కధానాయకుడు విడుదల అవడానికి అన్ని రకాలుగా సిద్దమవుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  బాలకృష్ణ  ఎన్టీఆర్ పాత్రను చేసాడు. అయితే ఈ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ సినీ ప్రయాణం ‘కథానాయకుడు’ పేరుతో తెరకెక్కగా  రాజకీయ జీవితం మహానాయకుడు’ పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘కథానాయకుడు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని  క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది.ముఖ్యంగా ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందడం మరో విశేషం.

ఈ సినిమా సంక్రాంతి రేసులో భారీ అంచనాలు సంతరించుకొని జనవరి 9వ థియేటర్లలో సందడి చేయబోతుంది. విద్యాబాలన్, రకుల్ , నిత్యామీనన్, హన్సిక , రానా, సుమంత్, కల్యాణ్ రామ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే మరో విశేషం బాలకృష్ణ ఈ సినిమాలో మొత్తం  63 గెటప్స్ లో కనిపించనున్నాడట  బాలకృష్ణ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి ఇపుడు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ రావడంతో అభిమానులలో సందడి నెలకొంది.

leave a reply