బన్నీ నెక్స్ట్ చిత్రం ..ఎవరితో?

ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న బన్నీ తన తదుపరి సినిమా గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తరువాత  అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. అయితే  తన నెక్ట్స్‌ మూవీ ఏ దర్శకుడితో అన్న విషయాన్ని  ప్రకటించని బన్నీ న్యూ ఇయిర్‌ వేడుకల సందర్భంగా అభిమానులకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే విషయం చెప్పబోతున్నాడట. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుదన్న ప్రచారం జరిగింది. అయితే విక్రమ్‌ తన తదుపరి సినిమా నానితో సినిమా ఉంటుందని  చెప్పడంతో  ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ప్రస్తతుం అల్లు అర్జున్‌  సినిమా  చేయబోయే దర్శకుల లిస్టులో  త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు పరశురాం పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా అంతరిక్షం సక్సెస్‌ తరువాత సంకల్ప్‌ రెడ్డితో కూడా బన్నీ సినిమా ఉంటుందంటూ కొంత ప్రచారం జరుగుతుంది . అయితే బన్నీ మాత్రం తన తదుపరి చిత్రం ఈ దర్శకుల్లో ఎవరితో చేస్తాడు..? కొత్త ఏడాది ఎలాంటి ప్రకటన చేస్తాడని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

leave a reply