కొవ్వును కరిగిస్తుందట..!

దానిమ్మ పండు గురించి చెప్పనవసరంలేదు. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. అనేక ప్రోటీన్లకు, పోషకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దానిమ్మ పండని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎక్కువగా గర్భిణులకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. పుట్టే బిడ్డ అందంగా, హెల్దీగా ఉండటానికి ఇవి మంచి పోషణను అందిస్తాయి. దీనిలో విటమిన్‌ సి, కే, ఫైబ‌ర్‌, పొటాషియం,  మెగ్నిషియం వంటి పోష‌కాలు ఉన్నాయి. ఇవి తరుచూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వది. వీటిని మామూలుగా తినడం ఇష్టపడని వారు జ్యూస్‌లాగా, సలాడ్స్‌ రూపంలో తీసుకుంటూ ఉంటే మంచింది.

రక్తాన్ని శుభ్ర పరచడంలో వీటిది ప్రముఖ పాత్ర. అలాగే.. దానిమ్మ పండు జ్యూస్‌ తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. దీని వ‌ల్ల గుండెకు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అవుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కీళ్ల ద‌గ్గ‌ర వాపులు తీవ్రంగా వ‌స్తే కీళ్ల నొప్పుల స‌మ‌స్యలు వ‌స్తాయి. వీటిని త‌గ్గించుకోవాల‌న్నా, ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా నిత్యం దానిమ్మ పండును తినాలి. లేదా ఆ పండు జ్యూస్ తాగాలి.

కడుపుతో ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. పుట్టే బిడ్డకు మంచి ఆరోగ్యాన్నిఅందిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎముకులకు మంచి ధృఢత్వాన్ని అందిస్తుంది. దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమ‌ర్ గుణాలు ఉన్నందున క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. హైబీపీ ఉన్న‌వారు నిత్యం దానిమ్మ పండు జ్యూస్‌ను తాగాలి. అలాగే ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల బాక్టీరియా, వైర‌ల్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. అంతే కాదండోయ్‌.. రోజూ వ్యాయామం చేసేవారికి దానిమ్మ పండ్ల జ్యూస్ మంచి శ‌క్తినిస్తుంది. కోల్పోయిన శ‌క్తిని తిరిగి ఇవ్వ‌డంతోపాటు పోష‌కాల‌ను కూడా అందిస్తుంది.

leave a reply