కోడి పందేల జోరు.. మొదలు

ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు సంక్రాతికి సర్దుకుని తమ స్వంత ప్రాంతాలకు వెళ్తారు. ఇళ్ల ముందు ముగ్గులతో, ఇంట్లో బంధువులతో, రుచికరమైన పిండివంటలతో ఆ నాలుగు రోజులూ ఉభయ గోదావరి జిల్లాలు నిండుగా కనిపిస్తాయి. కాగా.. సంక్రాతి అంటే పిండివంటలు, బంధువులు మాత్రమే కాదు. ఆంధ్రాలో సంక్రాతి పండగ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేవి కోడి పందాలు. ఈ పందాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి చాలా మంది సంక్రాతికి ఆంధ్రాకు చేరతారు.

ఈ పందాలపై హైకోర్టు స్టే ఇచ్చినా.. వాటిని సైతం లెక్కచేయకుండా పేకాటలు, పందాలు ఏటా జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగానే ఊళ్లల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కోడి పందాలకు అనుమతి లేదని, పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

leave a reply