క్యాల్షియం తగ్గిందా!

శరీరంలో క్యాల్షియం శాతం తగ్గితే ఎముకలు, పళ్లు బలహీనంగా తయారవుతాయి. ఇందుకోసం క్యాల్షియాన్ని తగ్గకుండా జాగ్రత్తపడాలి. క్యాల్షియం ఎముకలు ,పళ్ళు  ఆరోగ్యంగా ఉంచడమే కాక.. మరెన్నో విధాలుగా కూడా క్యాల్షియం శరీరానికి మేలు చేస్తుంది. క్యాల్షియం లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో,అందుకోసం ఏం తినాలో తెలుసుకుందాం.

శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల ఆనారోగ్యపాలవడం, నీరసానికి గురి కావడం , నిద్ర సరిగా ఉండకపోవడం, కండరాల నొప్పి అధికంగా ఉండటం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాల్షియం లోపం వల్ల గుండెకు కూడా హాని కలిగే ప్రమాదం ఉందట, దీని వల్ల గుండె వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం జరుగుతుంది. నెలసరి సరిగా రాకపోవడం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఈ పోషకలోపం వల్ల ఎదురవుతాయి.

ఈ సమస్యను అధికమించడానికి ఆహారంలో పాలు, పాల పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలానే చేపలు, పాలకూర, సోయా, నట్స్‌, గింజలు వంటివి ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మరీ క్యాల్షియం తక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

leave a reply