జయరామ్ హత్యలో.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వచ్చింది. శరీరం నీల వర్ణంలోకి మారడం వలన జయరామ్ చౌదరిపై విషప్రయోగం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. 

జయరామ్‌ మేనకోడలు అయిన శిఖాచౌదరి ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించిందని, జయరామ్ హత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారమై హత్యకు కారణమయి ఉండవచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు.

శిఖాచౌదరి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని ప్రచారం జరుగుతుండగా, జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి, రాకేష్ అనే యువకుడిని ప్రేమించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వారి పెళ్లికి శిఖాచౌదరి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.  అయినా, వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయాన్ని జయరామ్ చౌదరి గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత  రాకేష్‌ ని జయరామ్ కలిసి శిఖాచౌదరిని వదిలెయ్యాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. శిఖా చౌదరిని వదిలేయడానికి జయరామ్ రాకేష్ కు డబ్బు ఆశచూపినట్లు వార్తలు వస్తున్నాయి.

శిఖాచౌదరిని వదిలేస్తే రూ 3.5 కోట్లు ఇస్తానని రాకేష్ కి హామీ ఇచ్చినట్లు దానికి అంగీకరించిన రాకేష్ శిఖా చౌదరికి దూరంగా ఉంటున్నా.. జయరామ్ ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోవడంతో మళ్లీ ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది.

డబ్బు ఇవ్వకపోవడంతోపాటు తమని విడదీసేందుకు జయరామ్ కుట్ర పన్నారన్న అనుమానంతో ఇద్దరూ కలిసి హత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు జయరామ్ చౌదరి ఇంటికి శిఖాచౌదరి, రాకేష్ ఇద్దరూ వెళ్లినట్లు వాచ్ మన్ చెప్తున్నారు.

చనిపోయిన రోజు జయరామ్‌ ఇంటికి శిఖాచౌదరి వచ్చినట్లు వాచ్ మన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడించారు. శిఖాచౌదరి కంగారుగా ఉందని ఆమెతో పాటు రాకేష్ ఉన్నట్లు వాచ్ మన్ చెప్తున్నాడు.

జయరామ్ హత్య జరిగిన తర్వాత శిఖాచౌదరి మిస్ అవ్వడం 36 గంటలు తర్వాత ఆమె ఆచూకి లభించడం చూస్తుంటే ఆమె పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నారు.  జగ్గయ్యపేటలోని ఓ గెస్ట్ హౌస్ లో ఆమెను విచారిస్తున్నారు.

కాగా.. జయరామ్ చౌదరి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. భార్య పిల్లలు అమెరికా నుండి వచ్చిన వెంటనే అంత్యక్రియలు పూర్తి చెయ్యనున్నారు.

leave a reply