గడ్కరీ వ్యాఖ్యలు.. ఇరుకున పడ్డ మోడీ..!

కుటుంబాన్ని ఉద్దరించి దేశాన్ని ఉద్ధరించు అనే సమెత మనం వింటూనే ఉంటాం. అదే విధంగా పెళ్లాం, పిల్లల్ని చూసుకోకుండా దేశాన్ని ఉద్దరిస్తామంటే నమ్ముతారా..?.. ఇలాంటి మాటలు.. సూటిగా వస్తే.. ముందుగా.. అవి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరకే వెళ్తాయి. ఎందుకంటే.. ఆయన పెళ్లి చేసుకుని.. కుటుంబాన్ని పట్టించుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికీ ఆయన తన భార్య ఉన్న విషయాన్ని నేరుగా అంగీకరించరు.

అయినప్పటికీ.. మరో బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ.. సంచలన వ్యాఖ్యలతో బీజేపీని ఇరుకున పెడుతున్నారు. నాగ్‌పూర్‌లోని ఏబీవీపీ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ… కుటుంబాన్ని పట్టించుకున్నోడే. దేశాన్ని ఏలగలడని తేల్చేశారు. అంతేకాదు…. ముందు ఇళ్లు, ఇల్లాలు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోని వాళ్లు దేశాన్ని ఏం కాపాడుతారన్నట్లుగా మాట్లాడారు. ఇపుడీ కామెంట్స్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయ్‌.

చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసం ఏమైనా చేస్తామంటారని.. కానీ వాళ్లంతా ముందు వాళ్ల ఇంటిని చక్కదిద్దుకోవాలని చెప్పారు గడ్కరీ. సొంతింటినే బాగు చేసుకోని వాళ్లు… దేశాన్ని ఏం బాగు చేస్తారంటూ ప్రశ్నించారు.

గడ్కరీ కామెంట్స్‌.. ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. గడ్కరీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించే ఇలా మాట్లాడరంటూసోషల్‌ మీడియా కోడై కూస్తోంది. కుటుంబాన్ని పట్టించుకోని నాయకులు.. దేశాన్ని ఎలా ఏలుతారన్న కామెంట్స్‌ నేరుగా ప్రధాని మోదీకే తగులుతాయంటున్నారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై అటు బీజేపీలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

కాగా, గడ్కరీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ స్పందించారు. బీజేపీలో దమ్ము ఉన్న నాయకుడు గడ్కరీ ఒక్కరేనంటూ ప్రశంసించారు. అంతేకాదు.. రాఫెల్‌ డీల్‌, అనిల్‌ అంబానీ వ్యవహారం, రైతుల ఆత్మహత్యలతో పాటు వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేయడంపైనా మాట్లాడాలని కోరారు.

గడ్కరీ వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందనతో బీజేపీ డిఫెన్స్‌లో పడింది.సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా గడ్కరీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత గడ్కరీ చేసిన కామెంట్స్‌… కలకలం రేపాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లకు రంగుల కలలు చూపిస్తున్నారని… తర్వాత అవి నెరవేరకపోవడంతో.. జనాలు వారిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించేనంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు నేరుగా చేసిన ఈ విమర్శలు మరింత వేడెక్కనున్నాయి.

leave a reply