కూల్‌గా, స్టైల్‌గా సమ్మర్‌లో

సాధారణంగా టూవీలర్స్‌ మీద వెళ్లేటప్పుడు కళ్లల్లో దుమ్ము పడుతుందని కళ్లజోడు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడొచ్చేది సమ్మర్‌. ఎర్రటి సూర్యుడు నిప్పులు చెరగడానికి రెడీగా ఉన్నాడు. సో ఇంకొంచె కేర్‌ తీసుకుంటే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు టూవీలర్స్‌ మీద వెళ్లేవారు వీలైనంత వరకూ కూలింగ్‌ గ్లాసస్‌ పెట్టుకుంటే మంచింది. అయితే.. అవి మన ఫేస్‌ తగిన విధంగా ఉంటే ఇంకా చూడముచ్చటగా ఉంటుంది మరి అవేంటో తెలుసుకుందామా..?

1. దీర్ఘవృత్తాకారం: మీ ముఖం ఈ ఆకృతిలో ఉంటే దీర్ఘచతురస్రాకారం, నలుచదరం లేదా ఏవియేటర్‌ మోడల్‌ కళ్లద్దాలు ఎంచుకోవాలి.

2. వృత్తాకారం: ఈ ముఖాకృతి కలిగి ఉంటే, దీర్ఘచతురస్రం, నలుచదరం లేదా వృత్తాకార గాగుల్స్‌ ఎంచుకోవాలి.

3. నలుచదరం: ఈ కోవకు చెందిన వారు బ్రోలీన్‌, క్యాట్‌ ఐ, రౌండ్‌ మోడళ్లు ఎంచుకోవాలి.

4. డైమండ్‌: ఈ షేప్‌ కలిగి ఉంటే, ఓవల్‌, రౌండ్‌ లేదా క్యాట్‌ ఐ చలువ కళ్లజోళ్లు బాగుంటాయి.

5. పియర్‌: ఈ షేప్‌ అయితే బ్రోలీన్‌, ఓవల్‌, ఏవియేటర్‌ గాగుల్స్‌ నప్పుతాయి.

6. హార్ట్‌: దీర్ఘచతురస్రం, రౌండ్‌ లేదా జామెట్రిక్‌ షేప్‌ గ్లాసెస్‌ బాగుంటాయి.

ఇప్పుడు ఈ కూలిలంగ్‌ గ్లాసస్‌లో అన్ని కలర్స్‌ కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సో మీకు ఏ కలర్‌ ఇష్టమో.. హ్యాపీగా ఎంచుకోండి.

leave a reply