చేప చర్మంతో..సరికొత్త ఉపయోగం..

మాములుగా చేపలు ఆరోగ్యానికి మంచిది అని వింటుంటాం. కానీ తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఫెడరల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సియేరాకు చెందిన న్యూరాలజిస్ట్‌ ఫిలిప్‌ రోచా సరికొత్త విషయం చెప్పుకొచ్చారు. కాలిన గాయాలకు బ్యాండేజీ కన్నా చేప చర్మం ఎంతో మేలని, పైగా నొప్పి కూడా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎక్కువగా మంచినీటిలో ఎదిగిన థిలాపియా చేప చర్మం ఈ విషయంలో మెరుగ్గా పనిచేస్తుందని  సూచించారు. ఇందుకు గల కారణం దీని చర్మానికి  మనిషి చర్మానికి పోలికలు దగ్గరగా ఉంటాయని, అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది అని చెప్పారు.

అంతేకాకుండా ఈ చేప చర్మలో కొన్ని వైరస్ లను నశింపచేసే శక్తి దీనిలో ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడైనా గాయం అయితే బ్యాండేజ్ అవసరం లేకుండా చేప చర్మాన్ని గాయానికి తగ్గట్టుగా కత్తిరించి  అతికిస్తే సరిపోతుందని తెలిపారు. అయితే దీని నిల్వకోసం ఒకసారి చేప చర్మం కట్‌ చేసిన తర్వాత రెండేళ్ల వరకూ ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చునని తెలియచేసారు. గాయానికి దీనిని అతికించిన వారం తర్వాత తీసేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు.

leave a reply