జుట్టుకు ఆయిల్‌ ఇలా రాయాలి..

ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన జుట్టు కోసం నూనే రాయడం తప్పనిసరి. అయితే కొన్ని రకాల నూనే రాసే పద్దతులతో ప్రయోజనాలకంటే హాని ఎక్కువ కలుగుతుంది.

దురుసుగా రుద్దడం

వెంట్రుకలు చాల సున్నితమైనవి, అతిగా రుద్దడం వలన తెగిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, నెట్ట పైన చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. అందువలన నూనే రాసినప్పుడు వెంట్రుకలను, తలపై చర్మాన్ని మృదువుగా, వలయాకారంలో నిమురుతూ ఆయిల్ మర్దన చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే వెంట్రుకలు బలహీన పడి రాలిపోయే అవకాశం ఉంది.

తడిలో నూనే రాయడం

స్నానం చేసిన వెంటనే నూనె రాయడం కూడా ప్రమాదకరమైనదే. ఎందుకంటే వెంట్రుకల మొదల్లు చాలా సున్నితంగా ఉండడమే కాదు, తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి. అందుకని తడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా ఆరాకే ఆయిల్ పెట్టుకోవాలి.

చివర్లకు నూనే రాయక పోవడం

చాలా సార్లు ఆయిల్ రాయడం స్కాల్ప్ మరియు మొదల్లకే పరిమితం చేస్తాం, వెంట్రుకల చివరలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. ఇలా చేయడం వలన, చివరలకు సరైన పోషణ లభించక చిట్లిపోవడం జరుగుతుంది. ఇది పెరుగుదలను ఆపడమే కాకుండా, జుట్టు రాలి పోవడానికి కూడా కారణమవుతుంది.

సరైన నూనే వాడకపోవడం

చాలా మందికి నూనే అంటే కొబ్బరి నూనే అనుకుంటారు. ఇతర నూనెలను పట్టించుకోరు. కాని నూనేలలో కూడా చాల వెరైటీలు ఉన్నాయి. పోషణకు కొబ్బరి, పెరుగుదలకు బాదం మంచివి. ఇంతేకాక, అమల, శికకాయ్ లాంటి నూనెలు కూడా వివిధ రకాల జుట్టు కు సరైన పోషణ ను కలిగిస్తాయి. అందుకే సరైన నూనే ను ఎంచుకోవడం కూడా ముఖ్యమే.

leave a reply