కాసేపు బయటకు వెళ్తే మేలే!

కొంతమంది వయసు పైబడి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఇల్లు ధాటి బయటకి వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడమే అంటున్నారు. ఇందుకోసం రోజూ ఇల్లు దాటి కాసేపు అలా వెళ్లొస్తే వృద్దుల ఆయుష్షు పరుగుతుందని, ‘జోర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ జేరియాట్రిక్స్‌ సొసైటీ’ అనే సంచికలో తెలియచేసారు. చేసుకొనే పనుల్లో కొంత ఇబ్బంది రావడం, వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ, రోజూ ఇల్లు దాటి బాహ్య ప్రదేశాల్లో కాసేపు గడిపే 70 నుంచి 90 ఏళ్ల మధ్యనున్నవాళ్లను వారు పరిశీలిచారు. ఇల్లు దాటకుండా ఉండిపోయే వాళ్లతో పోలిస్తే, రోజూ బయటికి వెళ్లి వచ్చే వారి ఆయుష్షు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు .

వారిలో ప్రతిరోజూ బయటికి వెళ్లే వారు, వారానికి 2నుంచి 5 సార్లు వెళ్లేవారు, చాలా అరుదుగా అంటే, వారానికి ఒకసారి కన్నా తక్కువగా బయటికి వెళ్లే వారు ఇలా వృద్ధుల్ని వీరు మూడు బృందాలుగా విభజించారు. వీరందరి ఆరోగ్యాన్ని గమనిస్తే… ఎప్పుడో అరుదుగా మాత్రమే వెళ్లే వారి ఆరోగ్యం కంటే, రోజూ బయటికి వెళ్లే వారి ఆరోగ్యం చక్కగా ఉన్నట్లు తెలిపారు. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు కూడా రోజూ బయటికి వెళ్లడం వల్ల పెరిగినట్లు ఆ అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

leave a reply