ప్రజలు బుద్ధి చెప్పింది సరిపోలేదా.. నేను చెప్పాలా..?

శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భాంగా ఆయనపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇస్తూ ఇలా అన్నారు. బీజేపీకి కూడా ప్రజలు బుద్ధిచెప్పారు. 103 చోట్ల ఆపార్టీ డిపాజిట్‌ కూడా కోల్పోయింది. అయినా కాంగ్రెస్‌ నేతలకు బుద్ది రావడం లేదు. అసలు అభివృద్ధి చేస్తుంటే ఏడుస్తారెందుకు..? ప్రజలు మీరొద్దు అని బుద్ధి చెప్పారు కదా.. సరిపోలేదా? అని ప్రతిఘాటించారు.

అలాగే.. బీసీల మీద ప్రతిపక్షాలు ప్రేమను ఒలకబోస్తున్నాయి అని కేసీఆర్‌ విమర్శించారు. కాగా.. తెలంగాణాలో గతంలో 19 బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉంటే, ఇప్పుడు 261 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. 74 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా టీఆర్‌ఎస్‌నే అన్నారు. అలాగే.. స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌ పదవులను బీసీలకు ఇచ్చామన్నారు. 50 మంది బీసీలు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు అయ్యారు. బీసీలకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చింది మేము.

కాగా.. జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పార్టీ పదవుల్లో 51 శాతానికి పైగా బీసీలు ఉండాలని రూల్‌ పెట్టామన్నారు. కాబట్టి ఇప్పుడైనా ప్రజా తీర్పును గౌరవించి.. ఆరోపణలు తగ్గిస్తే మంచిదని సూచించారు.

leave a reply