నాకు ‘హీరోయిన్స్‌’లానే కనిపిస్తున్నారు

‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తో ఈ సినిమా థియేటర్స్‌లలో దూసుకెళ్తుంది. అయితే.. ఈ సినిమాపై  డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ తనదైన స్టైల్లో స్పందించారు. ‘సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు’ కురిపించారు. ఆమె ముందు హీరోలు కూడా అంత బాగా నటించరేమో.. అని అన్నారు. ఇంత ప్రతిభ నేను చివరిసారిగా బ్రూస్‌లీ ఎంటర్‌ ది డ్రాగాన్‌లో చూశా.. ఆ తర్వాత ‘మణికర్ణిక’లో కంగనలో హీరో కనిపించాడు. మిగిలిన యాక్షన్‌ హీరోలంతా హీరోయిన్లలా కనిపిస్తున్నారు అంటూ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు వర్మ.

అయితే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో విడుదలైంది. తొలి రోజున దేశవ్యాప్తంగా రూ. 8 కోట్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ సినిమా కోసం కంగన కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. క్రిష్‌, కంగన ఇద్దరూ ‘మణకర్ణిక’ సినిమాకి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌ ఈ సినిమాను నిర్మించింది.

కాగా.. ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కారణంగా ఆయన చాలా వివాదాలను ఎదుర్కొంటున్నారు.

leave a reply